Latest News

 • ముస్లింలకు తలదాచుకునే చోటు కూడా దక్కదు: పౌరసత్వ బిల్లు ప్రతులను చింపి, గాల్లోకి విసిరేసిన ఒవైసీ..!
  on December 9, 2019 at 4:21 pm

  న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్ సభలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన తరువాత సోమవారం రాత్రి వరకూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటనపై చర్చ సందర్భంగా.. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత,

 • మానవాభివృద్ధి సూచీలో మెరుగుపడిన భారత్ ర్యాంక్
  on December 9, 2019 at 4:08 pm

  న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సోమవారం విడుదల చేసిన 2019 మానవ అభివృద్ధి సూచీలో భారత ర్యాంక్ స్వల్పంగా మెరుగుపడింది. గత ఏడాది కంటే ఒక స్థానం పైకి ఎగబాకింది. 2018 సంవత్సరంలో భారత్ 0.647 మానవాభివృద్ధి విలువతో 130వ ర్యాంకులో ఉండగా.. ప్రస్తుతం ఒక మెట్టు పైకెక్కి 189 దేశాలకు గానూ 129వ స్థానంలో నిలిచింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి

 • Shadnagar Encounter: ఎన్ కౌంటర్ లో కొత్త కోణం: తూటాల తూట్లతో మహ్మద్ ఆరిఫ్ మృతదేహం..!
  on December 9, 2019 at 3:30 pm

  హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన ఉదంతంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ పై పోలీసులు ఎక్కువ సార్లు కాల్పులు జరిపినట్లు తేలింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

 • మావోయిస్టులకు బిగ్ షాక్: కేంద్ర కమిటీ సభ్యుడు రావుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి?
  on December 9, 2019 at 2:43 pm

  రాయ్ పూర్: టాప్ మావోయిస్టు నాయకుడు రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న అలియాస్ రమణ ఆకస్మికంగా మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో సోమవారం ఆయన మరణించినట్లు తెలుస్తోంది. దీనిపై మావోయిస్టులు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఆయన మరణంపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని జాతీయ మీడియా చెబుతోంది. ఛత్తీస్

 • వీఆర్ఎల్ బస్సుల్లో రూ.2000 నోట్లు చెల్లవ్: పెద్ద నోట్లు రద్దవుతాయంటూ..!
  on December 9, 2019 at 2:11 pm

  బెంగళూరు: ప్రముఖ లాజిస్టిక్, ప్రైవేటు బస్సు ఆపరేటర్ సంస్థ విజయానంద్ రోడ్ లైన్స్ లిమిటెడ్ (వీఆర్ఎల్) సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 2000 రూపాయల నోట్లను తీసుకోవద్దంటూ ఓ సర్కులర్ ను జారీ చేసింది. వీఆర్ఎల్ కు సంబంధించినంత వరకూ ఆ సంస్థకు చెందిన లాజిస్టిక్, ప్రైవేటు బస్సు సర్వీసుల్లో 2000 రూపాయల నోట్లు చెల్లవు. త్వరలో ఆ

 • Disha murder case: మరో కీలక వీడియో వైరల్, టోల్ ప్లాజా వద్ద నిందితులు ఇలా..
  on December 9, 2019 at 1:59 pm

  హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో మరో కీలక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవంబర్ 27న రాత్రి వెటర్నరీ వైద్యురాలిపై నలుగురు నిందితులు సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు. ఆ తర్వాత ఆమెను పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ రాత్రికి సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.

 • Tollywood: నిర్భయ తల్లితో పూనమ్ కౌర్: ఓ చిన్న ట్రీట్: భుజంపై చేతులు వేసి, ఆప్యాయంగా..!
  on December 9, 2019 at 1:34 pm

  న్యూఢిల్లీ: తనదైన శైలిలో పదునైన కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కే టాలీవుడ్ నటి..పూనమ్ కౌర్. మరోసారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు. కారణం- నిర్భయ తల్లి ఆశాదేవిని కలవడమే. దేశ రాజధానిలో అత్యాచారానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన నిర్భయ తల్లి ఆశాదేవిని పూనమ్ కౌర్ కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఆమెకు ఓ రెస్టారెంట్ లో

 • ‘జగనన్న ఉల్లిపాయల పథకం’ అని పెట్టుకోండి: ప్రాణాలు పోతున్నా అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్
  on December 9, 2019 at 1:14 pm

  అమరావతి: భారీగా పెరిగిన ఉల్లి ధరలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రజలకు ఉల్లిగడ్డలను కూడా సబ్సిడీలో సరిగా అందించలేని స్థితిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. మీ వల్లే ఎన్నికల్లో ఓడిపోయాను: కార్యకర్తలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం, జగన్ సర్కారుకు చురకలు

 • రూ. 1,200 కోట్ల ఆస్తి ఉన్నా ఉప ఎన్నికల్లో పిల్లాడి చేతిలో ఖేల్ ఖతం, బీజేపీకి బీజేపీ శత్రువా, పాపం ?
  on December 9, 2019 at 1:06 pm

  బెంగళూరు: కర్ణాటకలో జరిగిన 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చినా ఒక్క హోస్ కోటే నియోజక వర్గంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించారు. హోస్ కోటే నియోజక వర్గం ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ రెబల్

 • Prakash Raj: వెన్నుపోటుదారులను గెలిపించారు..కంగ్రాచ్యులేషన్స్ కర్ణాటక: ప్రకాశ్ రాజ్ సెటైర్లు
  on December 9, 2019 at 12:56 pm

  బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగేలా హై ఓల్టేజీ షాక్ ఇచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించగా.. రెండు చోట్ల మాత్రమే హస్తం పార్టీ విజయం సాధించగలిగింది. మరో 12 చోట్ల అధికార భారతీయ జనతా పార్టీ

 • పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న శాస్త్రవేత్తలు, మేధావులు..ఎందుకో తెలుసా?
  on December 9, 2019 at 12:19 pm

  న్యూఢిల్లీ:వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో పాస్‌ కాగా మరోవైపు పెద్ద ఎత్తున ఈ బిల్లుపై వ్యతిరేకత వస్తోంది. ప్రతిపాదించిన బిల్లులో అతి జాగ్రత్తగా ముస్లింలను తప్పించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేశంలోని శాస్త్రవేత్తలు, ఇతర మేధావులు. పౌరసత్వం మత ప్రాతిపదికన ఇవ్వడం భవిష్యత్తులో అలజడులకు దారి తీసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 • ఇది చాలా హాట్ గురూ: కొత్తగా పెళ్లయిన జంటకు కాస్లీ బహుమతి ఇచ్చిన మిత్రులు
  on December 9, 2019 at 12:15 pm

  కడలూరు: ఒక పెళ్లికి వెళుతుంటే మనతో పాటు ఒక మంచి గిఫ్ట్ తీసుకెళుతాం. గిఫ్ట్ ఇచ్చి నవదంపతులకు బెస్ట్ విషెస్ చెబుతాం. అంతేకాదు ఇచ్చే గిఫ్ట్ కూడా చాలా కాస్లీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే ఇచ్చే కానుక సరిగ్గా లేకుంటే నవ్వులపాలవుతామనే భయం వెంటాడుతుంది. అందుకే మన స్తోమతకు మించి మంచి గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం

 • నేనుండగా మమల్ని తాకలేరు.. మోడీ సర్కార్‌కు మమతా సవాల్
  on December 9, 2019 at 12:07 pm

  కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు. తాను ఉండగా పశ్చిమబెంగాల్ ప్రజలను ఎవరూ తాకలేరని ఆమె తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ శ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఆర్‌సీ భయంతో ఆరుగురు మృతి: బెంగాల్‌లో ఎన్‌ఆర్‌సీ ఉండదన్న మమతా

 • నిర్భయ దోషులకు ఉరితాళ్లు సిద్ధమవుతున్నాయి?: ఎక్కడో తెలుసా?
  on December 9, 2019 at 12:07 pm

  పాట్నా: దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులకు కొద్ది రోజుల్లోనే ఉరిశిక్ష అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. బీహార్ రాష్ట్రంలోని బక్సర్స్ జైలు.. ఉరితాళ్లను తయారుచేయమని ఈ జైలు అధికారులకు ఓ సందేశం వచ్చింది. కాగా, ఉరితాళ్లను తయారు చేయడంలో ఈ జైలు ఎంతో ప్రాచుర్యం పొందింది. Disha case encounter: నిర్భయ కేసులో అలాంటి ఆలోచన రాలేదని ఢిల్లీ మాజీ సీపీ

 • ఉప ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్: మరో బిగ్ వికెట్: కర్ణాటక కాంగ్రెస్ కకావికలం..!
  on December 9, 2019 at 12:01 pm

  బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ కకావికలమౌతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుస వికెట్లు టపటపంటూ పడుతున్నాయ్. కర్ణాటక కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, శాసన సభా పక్ష నేత సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేసిన సంఘటన సృష్టించిన ప్రకంపనలు సద్ధుమణగకముందే.. మరో సీనియర్ నాయకుడు బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఆయనే దినేష్ గుండూరావు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు.

 • దిశ ఘటనపై స్పందించిన జయప్రద ... చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హితవు
  on December 9, 2019 at 11:58 am

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో నేటికీ దేశంలో చర్చ జరుగుతుంది . నిన్నటి వరకు రోడ్ల పైకి వెళ్లే మహిళలకు భద్రత లేదని భావించిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్య, నిందితులను ఎన్కౌంటర్ చేయడం తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది. కానీ ఈ ఘటనపై

 • ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!
  on December 9, 2019 at 11:51 am

  చెన్నై: వరుసకు సోదరుడైన వ్యక్తి చిత్తకార్తె కుక్కలా వెంటపడి లైంగిక వేధింపులకు గురి చెయ్యడంతో తట్టుకోలేని మహిళ కొడవలితో అతన్ని దారుణంగా హత్య చేసింది. ఎంత చెప్పినా శారీరకంగా, ఫోన్లు చేసి మానసికంగా వేధింపులకు గురి చెయ్యడంతో వరుసకు అన్న అయ్యే వ్యక్తిని చంపేస్తానని బాధితురాలు పోలీసుల ముందు అంగీకరించింది. సోదరుడిని హత్య చేసిన మహిళ,ను ఆమె

 • బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సోనియా గాంధీ దూరం.. ఎందుకంటే..
  on December 9, 2019 at 11:48 am

  కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. దేశంలో మహిళలపై జరుగుతున్న, పెరిగిపోతున్న దాడులకు నిరసన ఈ ఏడాది జన్మదిన వేడుకలను జరుపుకోవద్దని నిర్ణయించుకొన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఇద్దరు మహిళల మరణాలు సోనియాను తీవ్రంగా

 • కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు, సిద్ధరామయ్య, దినేశ్ గుండురావు రాజీనామా
  on December 9, 2019 at 11:45 am

  కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. ఆయా స్థానాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 12 కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల అనర్హత వేటుతో పోలింగ్ జరిగిన సంగతి విదితమే. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప ప్రభుత్వం 105 మంది ఎమ్మెల్యేల బలంతో ఉంది. 15 మందిలో

 • వైఎస్ వివేకానంద హత్య కేసులో సిట్ విచారణకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గైర్హాజరు
  on December 9, 2019 at 11:38 am

  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో అనుమానితులను సిట్ ప్రశ్నిస్తోంది. వైఎస్ కుటుంబసభ్యులను, టీడీపీ నేతలను విచారిస్తోంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి హాజరయ్యారు. విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ ఆదేశించింది. కానీ దర్యాప్తుకు మాత్రం మాజీ మంత్రి హాజరుకావడం లేదు.

 • WhatsAPP కొత్త ఫీచర్: కాల్‌ వెయిటింగ్‌కోసం వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోండి
  on December 9, 2019 at 11:30 am

  ఆండ్రాయిడ్ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ యాప్ వాట్సాప్. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించేవారికి కొత్తగా కాల్ వెయిటింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాలింగ్ ఫీచర్‌లో సరికొత్త అప్డేట్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావాలంటే వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని యాజమాన్యం చెప్పింది. దీన్ని అప్‌డేట్ చేసుకుంటే రెగ్యులర్ ఫోన్‌ కాల్స్‌లో

 • యువత కోసం.. నంబర్ 37: ఏపీలో కొత్త శాఖ ఆవిర్భావం: త్వరలో పోర్ట్ ఫోలియోగా..!
  on December 9, 2019 at 11:23 am

  అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఓ శాఖ ఆవిర్భవించింది. ఇప్పటిదాకా 36 శాఖలు, వివిధ విభాగాలకు అదనంగా దీన్ని ఏర్పాటు చేశారు. అదే- నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ. త్వరలోనే దీన్ని మంత్రిత్వ శాఖగా మార్చనున్నారు. మంత్రివర్గంలోకి దీన్ని తీసుకోనున్నారు. 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఏర్పాటైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ

 • disha case encounter: సీపీ మహేష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
  on December 9, 2019 at 11:17 am

  హైదరాబాద్: దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్:పాలమూరు ఆస్పత్రి నుంచి చటాన్‌పల్లి వద్దకు ఎన్‌హెచ్‌ఆర్సీ, మీడియాకు..

 • అమ్మాయిలతో లోకేశ్, ‘కడుపుచేసే’ బాలకృష్ణ, టీడీపీ హయంలో సెక్స్ రాకెట్.. చంద్రబాబుపై రోజా ఫైర్
  on December 9, 2019 at 11:07 am

  మహిళల భద్రతపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. దిశ ఘటనను ఉదహరిస్తూ వైసీపీ మహిళ నేతలు ప్రసంగించారు. ఉల్లి సమస్యపై చర్చించాలని టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుకోబోయారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. లోకేశ్, బాలకృష్ణ, చంద్రబాబుపై ఫైరయ్యారు. మహిళల అంశంపై చర్చిస్తుంటే యావత్ దేశం ఏపీ అసెంబ్లీని గమనిస్తోందని రోజా పేర్కొన్నారు.

 • తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని .. గద్వాల జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం
  on December 9, 2019 at 11:02 am

  తెలంగాణ రాష్ట్రంలో ఇంకా తహసీల్దార్ కార్యాలయాల వద్ద పరిస్థితి మారటం లేదు . తహసీల్దార్ విజయ రెడ్డి సజీవ దహనం ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా తహసీల్దార్ కార్యాలయాల వద్ద చోటు చేసుకునే ఏదో ఒక ఘటన తహసీల్దార్ విజయారెడ్డి ఘటనని గుర్తు చేస్తూనే ఉంది . తాజాగా మరో తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్

 • కర్ణాటక ఉప ఎన్నిక ఫలితాల ఎఫెక్ట్:సీఎల్పీ పదవీకి సిద్దరామయ్య, దినేశ్ గుండురావు కూడా
  on December 9, 2019 at 11:00 am

  కర్ణాటక ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ జయభేరి మోగించింది. 12 సీట్లు గెలుచుకొని మెజార్టీ మార్కుకు దాటింది. రెండు సీట్లతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ నేతలు రాజీనామా బాటపడుతున్నారు. సీఎల్పీ పదవీకి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేశారు. తన

 • పర్యాటక కేంద్రంలో అగ్నిపర్వతం భారీ విస్పోటనం... ఐదుగురు మృతి
  on December 9, 2019 at 10:48 am

  న్యూజిలాండ్: న్యూజిలాండ్‌లో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. కొన్ని వేల అడుగుల ఎత్తుకు పొగ వ్యాపించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా చాలామంది గాయపడ్డారు. ఈ ఘటనలో 23 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అయితే సహాయకచర్యలకు అక్కడ పరిస్థితులు

 • Encounter: షాద్ నగర్ ఎన్ కౌంటర్ పై సుప్రీంలో పిల్: అర్జంట్ హియరింగ్..!
  on December 9, 2019 at 10:47 am

  న్యూఢిల్లీ: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు పాల్పడిన నలుగురు కామాంధులను ఎన్ కౌంటర్ చేసిన ఉదంతంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జీఎస్ మణి అనే వ్యక్తి ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. అర్జంట్ హియరింగ్

 • వైసీపీ ఎంపీపై రేప్ కేసు ఉంది..ఇదిగో ఆధారం: సభలో చంద్రబాబు: అధికారపక్షం అభ్యంతరం!
  on December 9, 2019 at 10:44 am

  ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసారు. వైసీపీకి చెందిన హిందూపూరం ఎంపీ మీద రేపు కేసు ఉందని ఆరోపించారు. శాసనసభలో ఏపీలో మహిళా భద్రతకు సంబంధించిన చర్చలో భాగంగా..ఈ ఆరు నెలల కాలంలో ఏపీలో మహిళల పైన జరిగిన ఘటనలను చంద్రబాబు సభ ముందుంచారు. జిల్లాల వారీగా చోటు చేసుకున్న అంశాలను వివరించారు.

 • పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది..? బిల్లుతో ఎవరికి లాభం ఎవరికి నష్టం?
  on December 9, 2019 at 10:39 am

  న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈశాన్య భారతంకు చెందిన రాష్ట్రాలు సిటిజెన్‌షిప్ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బిల్లుపై ప్రాధాన్యత సంతరించుకుంది.. అసలు పౌరసత్వ సవరణ బిల్లు మూలాలేంటి..? కేంద్రం ఈ బిల్లుకు సవరణ తీసుకురావడం ద్వారా ఎవరికి లాభం, ఎవరికి నష్టం..? పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో గట్టెక్కుతుందా..? శివసేన ఎటువైపు

 • సొంత పార్టీ ఓడిపోతే ఉప ముఖ్యమంత్రి హ్యాపీ, కొంచెం టైం ఉంది, దానికో లేక్కుంది, కుర్చీ సేఫ్?!
  on December 9, 2019 at 10:17 am

  బెంగళూరు: కర్ణాటకలో జరిగిన 15 శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ తన సత్తాచూటుకుంది. ఉప ఎన్నికల్లో బెంగళూరులోని శివాజీనగర నియోజక వర్గంలో బీజేపీ ఓడిపోవడంతో అందరూ షాక్ కు గురైనారు. అయితే ఉప ఎన్నికల్లో సొంత పార్టీ (బీజేపీ) ఓడిపోతే అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని, ఆయన

 • దిశ ఎన్‌కౌంటర్ నిందితుల విచారణ వాయిదా, సుప్రీంకోర్టులో ఉన్నందునే, గురువారం విచారణ..
  on December 9, 2019 at 10:13 am

  దిశను లైంగికదాడి చేసి హతమార్చిన నిందితుల ఎన్‌కౌంటర్‌‌కు సంబంధించి హైకోర్టులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గత శుక్రవారం ఎన్‌కౌంటర్ జరగగా.. ఆ రోజు రాత్రి మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులకు అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు భావించారు. కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్, హైకోర్టులో కేసు నమోదవడంతో అంత్యక్రియలకు బ్రేక్ పడింది.

 • అమిత్ షాపై ఘాటు పదాలతో చెలరేగిన ఒవైసీ: మందలించిన స్పీకర్: రికార్డుల నుంచి..!
  on December 9, 2019 at 9:46 am

  న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై చెలరేగిపోయారు. వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి దొర్లాయి. ఒవైసీ మాటతీరుపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహాన్ని వ్యక్తం

 • నాకు ఒక్క భార్యే: కొందరికి ముగ్గురు కూడా సరిపోక: శాసనసభలో జగన్ పంచ్ లు..!
  on December 9, 2019 at 9:43 am

  ముఖ్యమంత్రి జగన్ శాసనసభా వేదికగా మరోసారి భార్యల అంశాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ సారి ఎవరూ పేరును ఎత్తకుండానే పంచ్ లు వేసారు. దిశ ఘటన..ఏపీలో మహిళా భద్రత పైన చర్చకు సీఎం సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో నేరం జరిగిన తరువాత విచారణ..శిక్ష వేయటంలో జాప్యం ఉండకూడదని చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో తనకు కూడా ఇద్దరు

 • ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఇక ‘ఆధార్’ తప్పనిసరి
  on December 9, 2019 at 9:36 am

  న్యూఢిల్లీ: రైతులకు ఆర్థికంగా మద్దతునిచ్చేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు కావాలంటే ఇక బ్యాంక్ ఖాతాను ఆధార్‌కు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, ఇప్పటి వరకు ఈ పథకానికి

 • మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే 21 రోజుల్లో ఉరిశిక్ష: హాట్సాఫ్ కేసీఆర్..పోలీసు: సీఎం జగన్ సంచలనం..!
  on December 9, 2019 at 9:33 am

  ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా మహిళల పైన అఘాయిత్యాలకు పాల్పడితే..సరైన ఆధారాలు చిక్కితే వారికి 21 రోజుల్లోనే ఉరిశిక్ష పడేలా చట్టం తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు. మహిళా భద్రత మీద అసెంబ్లీలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. తెలంగాణలో జరిగిన దిశ ఘటన పైన సీఎం స్పందించారు. దిశపైన అత్యాచారం చేసి..చంపేసిన

 • అయోధ్యపై తీర్పులో షాకింగ్ ట్విస్ట్: తీర్పును వ్యతిరేకంగా హిందు మహాసభ రివ్యూ పిటీషన్..!
  on December 9, 2019 at 9:27 am

  న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో క్రమంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇఛ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ హిందు మహాసభ రివ్యూ పిటీషన్ వేయాలని నిర్ణయించుకుంది. తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయనున్నట్లు హిందూ మహాసభ ప్రతినిధులు ధృవీకరించారు. Ayodhya

 • సభా పర్వం : మహిళల భద్రత కోసం ఏం చేశారు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అంటూ విడదల రజనీ ఫైర్
  on December 9, 2019 at 9:08 am

  ఏపీ అసెంబ్లీ లో మహిళల భద్రత గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఏపీ శాసనసభలో మహిళా ఎమ్మెల్యేలు మహిళల భద్రత గురించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశ అత్యాచారం మరియు హత్య ఘటనను ప్రస్తావిస్తూ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని అందరినీ ఆలోచింపజేసేలా వ్యాఖ్యలు చేశారు. ఏపీ

 • పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చకు లోక్‌సభ ఆమోదం, అనుకూలం 293, వ్యతిరేకం 82 మంది
  on December 9, 2019 at 8:50 am

  పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌సభలో దుమారం రేపింది. బిల్లుకు కొన్ని సవరణలు చేసి సోమవారం హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం ఉందని విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. సభలో గందరగోళం మధ్య బిల్లు ప్రవేశపెట్టేందుకు దిగువసభ ఆమోదం తెలిపింది. డివిజన్ పద్ధతిలో స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 293

 • ప్రజల తీర్పుతో ఎవరు అనర్హులు, ఎవరు బకరాలు, మంత్రి బళ్లారి, మాజీ సీఎంలు ఎక్కడ ? !
  on December 9, 2019 at 8:43 am

  బెంగళూరు: ఉత్కంఠకు గురి చేసిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ అనుకూలంగా వచ్చిన సమయంలో కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు ఎవరు అనర్హులు ? మీరా ? మేమా ? అంటూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ

 • 13మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతోనే: ఇక..బీజేపీతోనే మాకు: కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు..!
  on December 9, 2019 at 8:37 am

  వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన తాజాగా తమ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద స్పందించారు. ఆనం నెల్లూరు జిల్లాలో మాఫియా పెరిగిపోయిందని..పోలీసు అధికారులను తాము పని చేసుకోనీయమంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు కారణమయ్యాయి. దీని పైన

 • చిన్నారులతో అశ్లీల కార్యకలాపాలు చేయిస్తున్న వారిపై తమిళ పోలీసుల కొరడా
  on December 9, 2019 at 8:34 am

  చెన్నై: చిన్నపిల్లలను పెట్టి పోర్న్ వీడియోస్ తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న మూడు గ్యాంగులను చెన్నై పోలీసులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది చిన్నారులకు సంబంధించిన పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఓ ప్రైవేట్ ఏజెన్సీ సహకారంతో తమిళనాడు పోలీస్ శాఖ సైబర్ సెల్ శాఖ గుర్తించింది. అంతేకాదు సైబర్ సెల్ ఆ

 • సభా పర్వం .. హెరిటేజ్ షాపుల్లోనే ఉల్లి ధర రూ.200... ఉల్లి ధరలపై చంద్రబాబుకు జగన్ పంచ్
  on December 9, 2019 at 8:02 am

  దేశంలో ప్రస్తుతం ఉల్లి సంక్షోభం కొనసాగుతుంది. అటు లోక్సభలోనూ, ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న అసెంబ్లీలోనూ ఉల్లి ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ఉల్లిపై లొల్లి కొనసాగింది. జగన్ రెడ్డి చేసే మేలు ఉల్లి కూడా చెయ్యదు ... మరోమారు సీఎం ను టార్గెట్ చేసిన పవన్

 • Miss Universe 2019: జాతి వివక్షపై పోరాడిన యువతి జోజిబినీ తున్జీదే విశ్వసుందరి టైటిల్
  on December 9, 2019 at 7:31 am

  ఏటా నిర్వహించే అందాల పోటీలు మిస్ యూనివర్శ్‌ 2019కిగాను విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది సౌతాఫ్రికా నల్లకలువ జోజిబినీ తున్జీ. మిస్‌ యూనివర్శ్ ఫైనల్లో జోజిబినీ తున్జీతో పాటు మిస్ ప్యూర్టోరికో మాడిసన్ ఆండర్‌సన్‌ పోటీ పడ్డారు. ఇక సెకండ్ రన్నర‌ప్‌గా మిస్ యూనివర్శ్ మెక్సికో నిలిచారు. 2018 మిస్ యూనివర్శ్‌గా నిలిచిన కాట్రియోనా గ్రే తాజా విశ్వసుందరి

 • యడ్డీ సర్కార్‌ సేఫ్, 12 చోట్ల ఆధిక్యం, నిజమైన ఎగ్జిట్ పోల్ అంచనాలు..
  on December 9, 2019 at 7:19 am

  కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం దిశగా సాగుతున్నారు. కర్ణాటక అసెంబ్లీకి 225 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు.. బీజేపీకి 105 మంది సభ్యులు ఉన్నారు. మరో 8 మంది సభ్యులు ఉంటే చాలు.. కానీ 12 మంది

 • శాసనసభలో ఉల్లి లొల్లి: స్పీకర్..సీఎం సీరియస్ : లోకేశ్..బాలకృష్ణ పై రోజా ఫైర్...!
  on December 9, 2019 at 7:16 am

  ఉల్లి ధరల వ్యవహారం ఏపీ అసెంబ్లీ రగడకు కారణమైంది. ఉల్లి ధరలు..నిత్యావసరాల పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా..స్పీకర్ దానిని తిరస్కరించారు. ఉదయం వెంకటాయ పాలెంలో ఎన్టీఆర్ విగ్రహనికి నివాళి అర్పించిన తరువాత టీడీపీ నేతలు ఉల్లిపాయలతో దండలు మెడలో వేసుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలోనూ బైఠాయించారు. ఇక, సభలో స్పీకర్ టీడీపీ ఇచ్చిన

 • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. 7900 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న మంత్రి
  on December 9, 2019 at 7:12 am

  ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలను కల్పించిన వైసీపీ సర్కార్ మరో నోటిఫికేషన్ కు రంగం సిద్ధం చేసుకుంది. ఏపీలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటానికి కంకణం కట్టుకున్న వైసీపీ ప్రభుత్వం మరో మారు

 • Disha case విచారణ: పోలీసులను ప్రశ్నిస్తున్న ఎన్‌హెచ్ఆర్సీ, అంశాల ఆధారంగా నివేదిక
  on December 9, 2019 at 6:57 am

  దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగుతోంది. తెలంగాణ పోలీసు అకాడమీలో పోలీసులు రెవెన్యూ అధికారులను బృందం ప్రశ్నించనుంది. దీంతో ఎన్‌కౌంటర్‌కి సంబంధించి విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడుగురు సభ్యుల బృందం.. ఎన్‌హెచ్ఆర్సీకి నివేదిక సమర్పిస్తే.. వాటి నివేదిక ఆధారంగా నోటీసులు జారీచేస్తారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్:పాలమూరు ఆస్పత్రి నుంచి చటాన్‌పల్లి వద్దకు ఎన్‌హెచ్‌ఆర్సీ, మీడియాకు..

 • పౌరసత్వ సవరణ బిల్లుతో హిందువులు ముస్లింల మధ్య చిచ్చుకు ప్రయత్నం: శివసేన
  on December 9, 2019 at 6:53 am

  ముంబై: పౌరసత్వ సవరణ బిల్లుపై తమ స్టాండ్‌ను స్పష్టం చేస్తూనే శివసేప పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించింది. పౌరసత్వ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా బీజేపీ ఓటుబ్యాంకు రాజకీయాలకు తెరలేపుతోందా అని ప్రశ్నించింది. అలా అయితే అది దేశానికి మంచిది కాదని అభిప్రాయపడింది. శివసేన మాతృపత్రిక సామ్నా ద్వారా శివసేన ప్రశ్నించింది. బీజేపీ నిర్ణయాన్ని

 • అచ్చెన్నకు సీఎం జగన్ పలకరింపుతో..: ఈ నెల 17వరకు ఏపీ అసెంబ్లీ: బీఏసీలో ఆసక్తికర పరిణామాలు...!
  on December 9, 2019 at 6:38 am

  ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. తొలి రోజు సమావేశంలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం బీఏసీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుండి ప్రారంభమైన సమావేశాలు ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించాలని డిసైడ్

NEWSLETTERS

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

[mc4wp_form id="57"]